స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో  అసలు ఊహించలేకుండా  ఉంటాయి. స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నవారికి ఒక్కొక్కసారి లాభాల పంట పండితే ఒక్కోసారి నష్టాలు మునిగిపోవాలి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ల ద్వారా ఎంతోమంది కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు. కోటీశ్వరులు ఏమీ లేని వారు అయిన వాళ్లు కూడా ఉన్నారు. కాగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ పై భారీ ఆశలు పెట్టుకున్న వ్యాపారులు అందరూ తలలు పట్టుకొని లబోదిబోమంటున్నారు. 

 

 అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసినట్లు  తెలుస్తోంది. గత మూడు నాలుగు రోజులనుండి స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే నడుస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. దీంతో ఎంతో మంది వ్యాపారులు స్టాక్ మార్కెట్లు నష్టాల ద్వారా భారీ మొత్తంలో నష్టపోయారు. అంతర్జాతీయంగా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లో సాగుతున్నాయి. గత మూడు రోజుల నుండి స్టాక్ మార్కెట్ నష్టాల్లో బాటలో నడుస్తూ ఉండటం తో చాలామంది ఇన్వెస్టర్లు  నష్టాన్ని చవి చూస్తున్నారు. 

 


 ఇక ఈ రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇరాన్ యూఎస్ మధ్య  ఉద్రిక్తత కారణంగా నెలకొన్న తీవ్ర  పరిస్థితులతో స్టాక్ మార్కెట్లో అన్ని నష్టాల బాటలోనే ముగిశాయి. దీంతో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ల పై కూడా పడింది. ఈ ప్రభావంతో సెన్సెక్స్ 788 పాయింట్ల నష్టంతో40,676 ముగియగా... నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో 11995 వద్దా క్లోస్ అయింది. దీంతో ఇవాళ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద మూడు లక్షల కోట్లు ఆవిరైపోయింది. అయితే అంతర్జాతీయంగా ఇరాన్ యుఎస్  మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో మరికొన్ని రోజులు ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ పై కూడా పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: