లోను కావాలంటే.. కొన్ని ఏళ్లపాటు తిరిగిన సరే.. అది ఇది అని లోన్ క్యాన్సల్  శాంక్షన్ చెయ్యరు బ్యాంకు అధికారులు కొందరు. అయ్యోపాపం .. ఏదైనా సమస్య ఉందేమో..  సమస్యను తీరుద్దాం.. డబ్బులు అవసరం ఏమో అని ఏ బ్యాంకు అధికారి అనుకోడు.. కానీ మనిషికి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో చెప్పలేం కదా.. 

 

ఒకొక్కసారి బంధువులను, స్నేహితులను అడిగి అప్పు తీసుకుంటాం. కానీ కొన్ని సార్లు అవి కూడా కుదరవు కదా.. అలాంటి సమయంలో బ్యాంకును ఆశ్రయించినప్పటికీ వాళ్ళు కూడా లోన్ ఇవ్వరు.. అది కావాలి.. ఇది కావాలి అంటారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా డైరెక్ట్ క్షణాల్లో రెండు లక్షలు లోన్ తీసుకోవచ్చు.. అది ఎలాగంటే?

 

ఎంపాకెట్ అనే మొబైల్ అప్లికేషన్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్.. ఇందులో 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు, విద్యార్థులు కూడా లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ లోన్ కోసం విదార్థి ఐడీ, కేవైసీ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌లో చేయాల్సి ఉంటుంది. వారికీ రూ.500 నుంచి రూ.20,000 మధ్యలో లోన్ వస్తుంది. 3 నెలల్లో ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 

 

శుభ్ లోన్స్ ఈ యాప్ డైరెక్ట్‌గా రుణాలు అందించకపోయినా కూడా రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రుణం అవసరమైన వారి సమాచారాన్ని లెండర్లకు, లెండర్ల వివరాలను రుణ గ్రహీతలకు ఇస్తుంది. ఇది ఇద్దరి మధ్య అనుసంధానంగా ఈ శుభ లోన్స్ పనిచేస్తుంది. ఆర్‌‌బీఐ ఈ సంస్థకు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ కూడా ఇచ్చింది.

 

ఎర్లీ శాలరీ.. ఇది కూడా ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్. ఇన్‌స్టంట్ లోన్స్ అందిస్తుంది. రూ.8,000 నుంచి రూ.2 లక్షల వరకు రుణాన్ని ఇస్తుంది. షాపింగ్ ఈఎంఐ, ట్రావెల్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. రుణ మొత్తం వెంటనే బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. తీసుకున్న లోన్‌ను 90 నుంచి 365 రోజుల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

 

చూశారుగా.. బ్యాంకుల చుట్టూ తిరగకుండానే క్షణాల్లో లోన్ ఇస్తుంది... ఇంకెందుకు ఆలస్యం.. అవసరమైన వారు ఈ యాప్స్ ని ఇంస్టాల్ చేసుకొని లోన్ తీసుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: