బంగారం కుదవపెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చినా ముందు గుర్తుకు వచ్చేది ముత్తూట్ ఫైనాన్స్  కంపెనీనే. సంస్థ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పై తాజాగా దాడి జరగటం సంచలనంగా మారింది. మంగళవారం ఉదయం కోచిలోని ఐజీ ఆఫీస్ ఎదురుగా దాడి జరిగింది. రాళ్ల దాడిలో జార్జ్ అలెగ్జాండ‌ర్ త‌ల‌కు గాయ‌మైంది.

 

అయితే దాడిలో ఇంకొక కోణం ఏమిటంటే.. ఇటీవ‌ల సుమారు 160 మంది ఉద్యోగుల‌ను కంపెనీ నుంచి తొల‌గించారు. ముత్తూట్‌లో ప‌నిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు దీన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా ధ‌ర్నా చేస్తున్నారు. సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా సాగింది. దాడి వెనుక ముత్తూట్ ఉద్యోగులు ఉండర‌ని తాను అనుకుంటున్నట్లు కార్మిక మంత్రి టీపీ రామ‌కృష్ణ‌ణ్ తెలిపారు.

 

ఘటనకు కారణంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సంస్థకు చెందిన వ్యక్తులే దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించింది. ఆరోపణల్ని సీఐటీయూ ఖండించింది. తాము ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు పాల్పడమని సంఘ నేత అనంతలవట్టమ్ ఆంనదన్ స్పష్టం చేశారు ఉదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి విచారణలో అసలు నిందితులు ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: