ఈ కాలంలో ఎన్నో రకాల గుడ్ న్యూస్ లు మనం వింటూనే ఉంటాం.. అవి మనకు ఉపయోగపడుతాయా ? లేదా ? అనేది పక్కన పెడితే రాసె ప్రతి ఒక్కరు మీ కోసం ఓ గుడ్ న్యూస్ అనే అంటారు. ఏమైతేనేం ఎవరో ఒకరి వల్ల మన నోటా ప్రతిరోజు గుడ్ న్యూస్ అనేది వింటూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే మరో గుడ్ న్యూస్ మీకోసం. 

 

దేశంలో ఈ-కామర్స్ రంగంలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. అయితే రెండు దిగ్గజ కంపెనీల మధ్య మాత్రం ఈ పోటీ ప్రధానంగా కొనసాగుతోంది. ఆ కంపెనీలే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అనే ఈ రెండు సంస్థలు. ఇవి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల సర్వీసులను ప్రస్తుతం అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అదిరిపోయే సూపర్ సేల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఊరిస్తుంటాయి.

 

ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు సరికొత్త సర్వీసులను లాంచ్ చేసింది. వీసా సేఫ్ క్లిక్ సేవలను ఆవిష్కరించింది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ వీసా కంపెనీతో జతకట్టింది. దీంతో వీసా కార్డులు కలిగిన కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌లో సులభంగానే లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. వీసా కార్డు ఉన్నవారు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసి బిల్లు చెల్లించే సమయంలో ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 

 

ఓటీపీ స్టెప్ లేకుండానే పని పూర్తవుతుంది. అయితే ఇది కేవలం రూ.2,000 వరకు లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓటీపీ లేకున్నా కూడా మీ లావాదేవీలకు వచ్చిన ఏలాంటి నష్టము ఉండదు. ఎందుకంటే మీ ట్రాన్సాక్సన్లకు పూర్తి భద్రత ఉంటుంది. వీఎస్‌సీ సేవల వల్ల ప్రస్తుత ఓటీపీ వ్యవస్థ రిప్లేస్ అవుతుందని ఆ కంపెనీ అధికారులు తెలిపారు. 

 

కాగా కొత్తగా రుణం తీసుకునే వారి కోసం, ఇతరుల కోసం ఫ్లిప్‌కార్ట్ పే లేటర్, కార్డ్‌లెస్ క్రెడిట్ వంటి సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఏది ఏమైనా ఫ్లిప్ కార్ట్ రోజుకో సేవను అందించి వినియోగదారులకు సర్ప్రైజ్ లు ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: