బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఖాసిం సులేమానీ హతంతో అమెరికాపై ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది ఇరాన్. ఫలితంగా బంగారంతో పాటు ముడి చమురు ధరలు ఆకాశానికంటుతున్నాయి. ఈ ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. 

 

ఈ నేపథ్యంలోనే నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 880 రూపాయిల పెరుగుదలతో 42,860 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 840 రూపాయిల పెరుగుదలతో 39,270 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అదే భాటలోనే పరుగులు పెట్టింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 250 రూపాయిలు పెరుగుదలతో 51,000 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధరలు చేరాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: