మన భారత దేశంలో అందరూ అభిమానించేది ఏదైనా ఒకటి ఉంది అంటే అది బంగారమే. బంగారంకు ఉన్నంత ఫ్యాన్స్ ఏ సినీ స్టార్ కి కూడా ఉండరు అనుకోండి. అంత పిచ్చి బంగారం అంటే భారతీయులకు. ఈ నేపథ్యంలోనే పసిడి ప్రియులకు ఇది మరో గుడ్ న్యూస్ అని చెప్పచ్చు.. కేవలం రెండు రోజుల్లో బంగారం ధర 1340 రూపాయిలు తగ్గింది అంటే మాములు విషయమా.. 

 

పెరిగింది కూడా అలాగే పెరిగింది లెండి.. అది వేరే విషయం అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే.. కేవలం రెండు రోజుల్లో 1340 రూపాయిలు బంగారం ధర తగ్గటం.. ఇదే మొదటిసారి. సంక్రాంతి వచ్చింది... బంగారం తగ్గింది. కానీ ఏం లాభం.. ఇంకా అందరూ బంగారం కొనడానికి వెళ్తారు.. దేశీయంగా బంగారంపై డిమాండ్ పెరిగి మళ్ళి రేపు ఈ బంగారం ధర పెంచిపిస్తారు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా క్షిణించింది. గత రెండు రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.1,340 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.39,270 నుంచి రూ.37,930కు చేరింది. ఇంకా అలానే 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. రూ.1,080 పతనమై 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.42,860 నుంచి రూ.41,780కు క్షీణించింది.

 

ఇంకా బంగారం ధర భారీగా తగ్గితే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత రెండు రోజుల్లో రూ.1,900 పడిపోయి సంచలనం సృష్టించింది. ఇలా బంగారం, వెండి ధరలు అత్యంత దారుణంగా తగ్గి అందరికి షాక్ ఇస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వార్త పాసీప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: