బంగారం.. ఈ బంగారానికి ఎంతమంది ప్రియులు ఉంటారో చెప్పలేము.. ఇంకా భారత్ లో అయితే బంగారం ప్రియులు ఇంట ఇంట ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే పసిడి ధర కొండా ఎక్కింది. ఆ బంగారం కొండెక్కినది చూసి బంగారం కొనాలంటే చాలు వెనకడుగు వేస్తున్నారు పసిడి ప్రియులు. 

 

అయితే వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఆభరణ వర్తకులు హాల్‌మార్క్‌ నగలను, అదీ 14, 18, 22 క్యారెట్ల స్వచ్ఛత బంగారంతో చేసిన వాటినే అమ్మాలి. ఈ నిబంధనలు ఉల్లంగిస్తే వారికి భారీ జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ తెలిపారు.

 

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌  వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో పాటు బంగారం స్వచ్ఛతకు హామీగా నగలకు తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ నిబంధనను అమలు చేసేందుకు ఆభరణ విక్రేతలకు ఏడాది గడువు ఇచ్చారు. 2021 జనవరి 15 నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రేపు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: