రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డుల భద్రత కొరకు నిన్నటినుండి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఆర్బీఐ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్లో దేశీయ లావాదేవీల కొరకు ఏటీఎంలలో, పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్ వద్ద మాత్రమే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వర్తించే విధంగా ఉండాలని పేర్కొంది. విడిగా ధరఖాస్తు చేసుకున్న వారికి తమ డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్ లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్ లెస్ లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఇప్పటికే డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఆన్ లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్ లెస్ లావాదేవీల కొరకు ఉపయోగించే వారికి ఏ సమస్య లేదు. కానీ ఎవరైనా కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్ లైన్ లావాదేవీల కొరకు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించని పక్షంలో వారి డెబిట్ , క్రెడిట్ కార్డులకు ఈ సేవలు నిలిపివేయబడతాయి. 
 
క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నవారు బ్యాంకుకు వెళ్లి ధరఖాస్తు చేసుకుంటే మాత్రమే ఈ సేవలను పొందవచ్చు. బ్యాంకులు ఇప్పటికే క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్ లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్ లెస్ లావాదేవీలు చేసేవారికి నిలిపివేయాలా...? వద్దా...? అని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు ఆన్ లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్ లెస్ లావాదేవీల కొరకు ఎప్పుడూ వినియోగించని కార్డులు మాత్రం ఖచ్చితంగా నిలిపివేయబడతాయి అని చెబుతున్నారు. 
 
ఆర్బీఐ బ్యాంకులకు ఈ మెయిల్ మరియు ఎస్సెమ్మెస్ ద్వారా కార్డు యొక్క స్థితిలోని మార్పులను తెలియజేయాలని సూచించింది. ఈ నిబంధనలను ఏ బ్యాంకు ఎప్పటినుండి అమలు చేయనుందో తెలియాల్సి ఉంది. డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన మోసాలు రోజురోజుకు పెరుగుతూ ఉండటం వలన ఆర్బీఐ ఈ రూల్స్ ను అమలులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: