బంగారం.. అనుకుంటాం కానీ.. ఇప్పుడు కొనేలా ఉందా? ఎంత మంచి డిజైన్ బంగారం చుసిన సరే కొనాలంటే వణుకు పుడుతుంది.. ఆలా ఉంది ప్రస్తుతం బంగారం ధర. సరే సరే.. ఎలా ఉన్న.. నా లాంటి బంగారం పిచ్చోళ్ళు బనే ఉంటారు.. కాబట్టి బంగారం బాగానే కొంటారు.. అందుకే బంగారం కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోండి. లేకపోతే బొక్క బోర్లా పడుతారు. 

 

మీకు అర్థం అవుతుందా ? సరే ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బంగారానికి సంబంధించి కొత్త రూల్స్ తీసుకువచ్చింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు అవి తెలుసుకోకుండా కొంటె మీ డబ్బులు స్వాహా అవుతాయి.. మోదీ ప్రభుత్వం గోల్డ్ జువెలరీకి హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసింది. అందుకే రూల్స్ పాటించాలి. 

 

2021 జనవరి 15 నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించడం కుదరదు. అందువల్ల జువెలరీ సంస్థలు అన్నీ ఈలోపు బీఐఎస్ రిజిస్ట్రేషన్ పొందాలి. అదేసమయంలో పాత స్టాక్‌ను అమ్మేసుకోవాలి.  అసలు బంగారు ఆభరణాలు కొనేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుస్కోండి. 

 

బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ మూడు రకాలుగా ఉంటుంది. 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ అనే కేటగిరిల్లో హాల్‌మార్క్ చేస్తారు. అలాగే బంగారు నగలు, గోల్డ్ జువెలరీ కొనుగోలు చేసే కస్టమర్లు మోసపోవద్దనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జువెలరీ హాల్‌మార్క్‌కు చార్జీలు పడతాయి. బీఐఎస్ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక ఆభరణానికి హాల్‌‌మార్క్ కోసం రూ.35 తీసుకుంటారు.

 

హాల్‌మార్కింగ్ వల్ల కస్టమర్లు వారు కొనే ఆభరణాల స్వచ్ఛత గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. మోసపోవడానికి ఏ మాత్రం వీలుండదు. గోల్డ్ జువెలరీ హాల్‌మార్క్‌లో నాలుగు మార్క్స్ ఉంటాయి. బీఐఎస్ మార్క్, ప్యూరిటీ (క్యారెట్), హాల్‌మార్క్ సెంటర్ నేమ్, జువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనే అంశాలను హాల్‌మార్క్‌లో చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: