బంగారం నాలుగు రోజుల పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. బంగారం ధరలు.. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతాయి. ఇలా రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే బంగారం.. ఈ మధ్యకాలంలో దారుణంగా తయారు అయ్యింది. అయితే ఒకసారి 20 రూపాయిలు బంగారం తగ్గితే మరుసటి రోజు 200 రూపాయిలు పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 

 

నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిల తగ్గుదలతో 41,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 90 రూపాయిల తగ్గుదలతో 38,200 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర స్థిరంగా కొనసాగింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 48,900 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

 

విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఇంకా ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పసిడి ప్రేమికులు బంగారం కావాల్సినంత కొంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: