వాహనదారులకు నిజంగా ఇది మంచి న్యూస్.. ఎందుకంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజుల నుండి భారీగా తగ్గుతూ వస్తున్నాయి. రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న ఈ పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. 

 

అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు వారం నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు బుధువారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 17 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 23 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 19 పైసలు తగ్గుదలతో రూ. 79.43కు చేరగా, డీజల్ ధర 23 పైసలు తగ్గుదలతో 74.03 రూపాయలకు చేరింది. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా ఎంత మాత్రం తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: