2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం మరో పది రోజులలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ కు సంబంధించిన పత్రాలు ప్రింట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టినా ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 
 
ఆర్థిక మందగమనం ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో ఈసారి బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటానికి ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదు. అందువలన రానున్న బడ్జెట్ పై అందరి చూపు ఉంది. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించేలా పలు కీలకమైన నిర్ణయాలు రానున్న బడ్జెట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది, 
 
ఈ బడ్జెట్ లో ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రయోజనాలు చేకూరే విధంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీ మొత్తం పరిమితిని పెంచే పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాపర్టీ వాల్యూ లెక్కింపులో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రాపర్టీ నికర విలువలో మరమ్మత్తులు కోసం 30 శాతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: