ఐఫోన్ అంటే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు యాపిల్ సంస్థ తక్కువ ధరల్లోనే ఐఫోన్ అందించాలని నిర్ణయించింది. ఒక అంచనా ప్రకారం ఈ కొత్త ఐపోన్ రూ. 14000 రూపాయలకే అందుబాటులోకి రానుందట. ఫిబ్రవరి నుంచి తయారీ చేయనున్న ఈ ఫోన్ మార్చిలో విడుదల కాబోతోంది.

 

ఐఫోన్ ఎస్ఈ తరవాత ఇది తక్కువ ధర ఐఫోన్ గా ఉండొచ్చు. ఇది 2017లో ఆవిష్కరించిన ఐఫోన్ 8 తరహాల, 4.7 అంగుళాల తెరతో ఈ ఫోన్ ఉంటుందని భావిస్తున్నారు. హోమ్ బటన్లో టచ్ ఐడీ ఉంటుందట. ముఖాన్ని గుర్తించి పరిజ్ఞానం ఉండకపోవచ్చట.

 

ఈ చౌక ధర ఫోన్లతో భారత్ లో మార్కెట్ పెంచుకోవాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ బ్లూంబర్గ్ ఈ విషయం వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ తయారీ పనులను తైవాన్‌కు చెందిన హా య్ ప్రెసిషన్ ఇండస్ట్రీ, పెట్రాన్ కార్పొరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్లకు అప్పగించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: