పీఎఫ్ ఖాతా ఉన్నవారికి ఓ పెద్ద గుడ్ న్యూస్.. ఏంటి అనుకుంటున్నారా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO నే ఈ శుభవార్తను చెప్పింది. అది ఏంటి అంటే.. సరికొత్త సదుపాయాన్ని ఈ పీఎఫ్ ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు ఉద్యోగం మారిన ఆ తర్వాత తమ ఎగ్జిట్ డేట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే అవకాశాన్ని పీఎఫ్ ఖాతాదారులకు కల్పిస్తూ 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' సదుపాయాన్ని ప్రారంభించింది ఈపీఎఫ్ఓ. 

 

ఇప్పటివరకు ఎగ్జిట్ డేట్ కోసం ఉద్యోగులు తమ మాజీ యాజమాన్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే అలా అదరపడినందుకు ఆ యాజమాన్యం ఎంతో టార్చర్ చేసేది.. అయితే ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఈ పీఎఫ్ఓ ఆన్‌లైన్‌లో ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇన్నాళ్లు పీఎఫ్ఓ ఖాతాదారులు పడిన ఇబ్బందులకు చెక్ పెట్టింది. 

 

పీఎఫ్ఓ పోర్టల్‌లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ వెల్లడించేందుకు గత యాజమాన్యాలు సహకరించడం లేదు అని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో పీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై పీఎఫ్ ఖాతాదారులే ''డేట్ ఆఫ్ ఎగ్జిట్''ను ఆన్‌లైన్‌లో సులువుగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఏమైతేనేం ఖాతాదారులకు మంచి చల్లటి శుభవార్త లభించింది. ఇక నుండి ఎవరిపై ఆధార పడకుండా.. మీకు మీరే ఈపీఎఫ్ ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: