వాహనదారులకు అదిరిపోయే న్యూస్ ఇది. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.. ఆ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం చూస్తే వావ్ అనిపిస్తుంది. ఏంటి పెట్రోల్, డీజిల్ ఇంత తగ్గాయా అని.. ఎందుకంటే.. వరుసగా గత రెండు నెలల నుండి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజుల నుండి భారీగా తగ్గుతున్నాయి.

 

రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు వారం నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు శుక్రవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 18 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 20 పైసలు తగ్గింది. 

 

హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 18 పైసలు తగ్గుదలతో రూ. 79.38కు చేరగా, డీజల్ ధర 20 పైసలు తగ్గుదలతో 73.27 రూపాయలకు చేరింది. ఇంకా విజయవాడలో, అమరావతిలో కూడా పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.  ఏది ఏమైనప్పటికి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి .. ఇది సంతోషించాల్సిన విషయమే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: