ఏంటి ?  షాక్ అనుకుంటున్నారా? నిజంగానే నిజమైన షాక్ ఇది. ఉద్యోగులకు పాన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చిన షాక్ లు అవి. ఇంకా అసలు విషయానికి వస్తే.. మనం యుద్యోగం చేసే సంస్దలో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవ్వకపోతే టీడీఎస్‌ కింద 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలలో కట్ చేస్తారు. 

 

ఈ విషయాన్ని .. ఆదాయపు పన్ను శాఖ అన్ని సంస్థల యాజమాన్యాలకు మరోసారి వెల్లడించింది. గత వారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యిలర్‌ జారీ చేసింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్ వివరాలను యాజమాన్యాలకు ఇవ్వాలి. 

 

ఒకవేళ ఇవ్వకపోతే వచ్చే నెల జీతంలో తప్పనిసరిగా 20శాతం వరుకు జీతం కట్ చెయ్యడం జరుగుతుంది. అందుకే ఒకవేళ ఇవ్వకపోతే మీ సంస్ద యాజమాన్యానికి వెంటనే మీ పాన్, ఆధార్ కార్డులు ఇవ్వండి. అప్పుడే మీ జాతంలో పన్ను కట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్‌ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి. 

 

ఇవ్వకపోతే జీతంలో 20శాతం కానీ, చట్టంలో ఉండే రేటు ప్రకారం కానీ ఏది ఎక్కువ ఉంటె అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి వద్ద నుండి కత్తిరించచ్చు. అందుకే మీరు వెంటనే మీ యాజమాన్యానికి మీ ఆధార్, పాన్ కార్డుల వివరాలను తెలియజేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: