రేపు రిపబ్లిక్ డే.. ఇంతలోనే వాహనదారులకు అదిరిపోయే న్యూస్. అంత అదిరిపోయే న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.. ఆ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం చూస్తే వావ్ అనిపిస్తుంది. ఏంటి పెట్రోల్, డీజిల్ ఇంత తగ్గాయా అని.. ఎందుకంటే..? వరుసగా గత రెండు నెలల నుండి భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రెండు వారాల నుండి భారీగా తగ్గుతున్నాయి.

 

అయితే రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు రెండు వారాల నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు శనివారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 24 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 20 పైసలు తగ్గింది. 

 

హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 24 పైసలు తగ్గుదలతో రూ. 79.14కు చేరగా, డీజల్ ధర 27 పైసలు తగ్గుదలతో 73.72 రూపాయలకు చేరింది. ఇంకా విజయవాడలో, అమరావతిలో కూడా పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.  ఏది ఏమైనప్పటికి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. రిపబ్లిక్ డే కు సంతోషకరమైన న్యూస్ వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: