మనం భారతీయులం.. మనకు బంగారంపై ప్రేమ ఎక్కువ.. పసిడి అంటే ప్రాణాలు ఇచ్చేస్తాం.. మనకు అంత ప్రేమ పసిడి అంటే.. నిజం. మన దెగ్గర డబ్బులు ఉన్నాయి అంటే చాలు.. బంగారం కొనాలంటాం.. ఇంకా ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భంమ్ ఉన్న.. పెళ్లి చేసిన.. చేతికి పెద్ద మొత్తం డబ్బులు వచ్చిన బంగారం కొందాం అని అంటాము. 

 

బంగారం అంటే అంత ఇష్టం మరి.. అందుకే బంగారం డిమాండ్ పెరిగింది. ఒక్క ఈ సంవత్సరమే బంగారం ధర ఏకంగా 25 శాతం పరుగులు పెట్టేసింది. ఇంకా పెరుగుతుంది తప్ప.. తగ్గటం లేదు.. పసిడి అంటే ఇంతే.. అందుకే పసిడి ప్రియులు అంత ఇప్పుడు అభిప్రాయాలు మార్చేసుకున్నారు.. వారి ప్రేమను అంత ప్లాటినంపై పెట్టాశారు. 

 

ఇంతలో పెళ్లిళ్ల సీజన్.. సో బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇంకా అస్సలు బంగారం కొనలేరు.. బంగారం ధర ఇప్పటికే 40వేలు పైన ఉంది..  అంటే 10 గ్రాముల బంగారం ధర 41 వేల రూపాయిలు ఉంది.. అది కాస్త పెళ్లిళ్ల సీజన్ కాబట్టి మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ప్లాటినం ధర 10 గ్రాములకు 31,400 రూపాయిలు మాత్రమే ఉంది.. 

 

 అంతే బంగారం కంటే 10వేలు తక్కువ.. అందుకే అందరూ బంగారం కాకుండా ప్లాటినం అంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్లాటినం ఏ తీసుకుంటాం అంటున్నారు ప్రస్తుతం ప్రజలు.. మరి ఇంకా ఈ ప్లాటినం ధర ఎంత పెరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా పసిడి ధరలు మరి దారుణంగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: