బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుదల నమోదు చేసిన బంగారం వెండి ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. ఏకంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 430 రూపాయలు పెరిగింది. ఇదే సందర్భంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,660 నుంచి 42,090 రూపాయలకు ఎగసింది. మరోపక్క పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 430 రూపాయలు పెరగడంతో 38,190 నుంచి 38,620 రూపాయల వద్దకు చేరుకుంది. అంతేకాకుండా బంగారం ధరలు మాదిరిగానే అదే రేంజ్ లో వెండి ధరలు కూడా పెరగడం విశేషం. 

 

కేజీ వెండి ధ‌ర 140 రూపాయల పెరుగుదలతో.. 49,060 రూపాయల నుంచి 49,200 రూపాయలకు చేరుకుంది. ఇదే తరుణంలో ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,650 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 450 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,450 రూపాయలకు చేరింది. ఇదే తరుణంలో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది.

 

పెరిగిన వెండి ధర బట్టి చూస్తే కేజీకి 49,200 రూపాయలు పలకడం విశేషం. అంతేకాకుండా విజయవాడ మరియు విశాఖపట్టణం లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,090 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,620 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర భారీగా పెరిగి 49,200 రూపాయల వద్దకు చేరుకుంది.  దీంతో ప్రస్తుత మార్కెట్ బట్టి చూస్తే రాబోయే మూడు నెలల్లో ఇంకా ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ టైం లో బంగారం అమ్ముకుంటే చాలా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు చాలామంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: