పోస్టల్ డిపార్టుమెంట్ పోస్టాఫీస్ కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. పోస్టాఫీస్ లో సేవింగ్స్ ఖాతాలు ఉన్న ఖాతాదారులకు పోస్టల్ డిపార్టుమెంట్ మినిమం బ్యాలన్స్ పరిమితిని పెంచింది. తాజాగా పోస్టల్ డిపార్టుమెంట్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టల్ డిపార్టుమెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టాఫీస్ లో సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉన్న ఖాతాదారులందరూ 500 రూపాయలు మినిమం బ్యాలన్స్ ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. 
 
పోస్టల్ డిపార్టుమెంట్ ఖాతాదారులు ఎవరైతే 500 రూపాయలు మినిమం బ్యాలన్స్ కలిగి ఉండరో వారి ఖాతాల నుండి 100 రూపాయలు జరిమానా కింద కట్ చేసుకుంటామని తెలిపింది. ఈ పెనాల్టీ డబ్బులు ఆర్థిక సంవత్సరం చివరి పనిదినం రోజున కట్ అవుతాయని పోస్టల్ డిపార్టుమెంట్ తెలిపింది. పోస్టల్ డిపార్టుమెంట్ ఇప్పటికే సేవింగ్స్ ఖాతాదారులకు కొత్త మినిమం బ్యాలన్స్ నిబంధనల గురించి తెలియజేయాలని పోస్టాఫీస్ లకు సూచించింది. 
 
ఇది వరకు మినిమం బ్యాలన్స్ పరిమితి కేవలం 50 రూపాయలుగా ఉండేదని మినిమం బ్యాలన్స్ పరిమితి తక్కువగా ఉండటం వలన సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు ఇండియా పోస్ట్ కు నష్టం కలుగుతోందని పోస్టల్ డిపార్టుమెంట్ పేర్కొంది. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో ఆర్థిక సంవత్సరం చివరి రోజున జీరో బ్యాలన్స్ ఉంటే మాత్రం సేవింగ్స్ ఖాతా ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుందని పోస్టల్ డిపార్టుమెంట్ పేర్కొంది. 500 రూపాయలు క్యాష్ రూపంలో చెల్లిస్తే మాత్రమే కొత్త ఖాతాను ఓపెన్ చేయవచ్చని పోస్టల్ డిపార్టుమెంట్ పేర్కొంది. 
 
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక లావాదేవీ అయినా జరపాలని అలా జరిపితే మాత్రమే అకౌంట్ పని చేస్తుందని పోస్టల్ డిపార్టుమెంట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ మొత్తానికి ఏడాదిలో 10,000 రూపాయల వరకు ఎలాంటి పన్ను ఉండదని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: