టైటిల్ చూడగానే మతిపోయింది కదా.. మనం ఎప్పుడైనా.. ఎక్కడైనా ఉద్యోగం చెయ్యాలంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సినది ఏంటి? సర్టిఫికెట్లు.. కానీ వాళ్లకు అవి అవసరం లేదట.. వర్క్ కూడా ఏమి ఉండదు.. ఆ పని చూస్తే ఇంకా షాక్ అవుతారు.. ఆ పనులు ఏంటో తెలుసా? నిజంగా షుక్ అవుతారు.. 

 

సరే నేను చెప్పేస్తున్నా.. ఆ పని ఏంటి అంటే.. తినడం.. తిరగడం. కాకపోతే ఓకేచోట కాదు.. వివిధ దేశాలు తిరగలి.. వివిధ ప్రాంతాలు తిరగాలి.. అక్కడ పార్టీలు ఎంజాయ్ చెయ్యాలి.. ఎంజాయ్ చేసి.. అక్కడ ఎలా ఉంది? అనే రివ్యూ మాత్రమే ఇవ్వాలి. ఆలా రివ్యూ ఇచ్చినందుకు గాను సంవత్సరానికి 16 లక్షల రూపాయిలు ఇస్తారట. 

 

16 లక్షల రూపాయిల అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. అయితే ఆలా రివ్యూ తీసుకున్నాక.. మీకు మరో ముఖ్యమైన బాధ్య ఉంది. అది ఏంటి అంటే.. ప్రివెడ్డింగ్ పార్టీని కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఆర్గనైజ్ చేయాలి. ఈ ఆఫర్ యూకేకు చెందిన గోహెన్ అనే కంపెనీ ఇస్తుంది. ఈ జాబ్‌కు ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. కేవలం ఫన్ క్రియేట్ చేయడం, క్రియేటివ్‌గా ఆలోచిచడం, పార్టీల గురించి తెలిసి ఉండి వాటిని సక్రమంగా నిర్వహించడం అంతే సరిపోతుంది. ఇంతటి మంచి జాబ్ కు మీరు అప్లై చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరాశ చెందుతారు.. ఎందుకంటే ఈ జాబ్ కేవలం యూకే ప్రజలకు మాత్రమే.. మారె ఏ ఇతర దేశాల వారికీ ఈ జాబ్ అవకాశం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: