పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళి భారీగా తగ్గాయి.. ఎంత తగ్గాయి అంటే సరిగ్గా చెప్పలేం కానీ.. భారీగా తగ్గాయి అని మాత్రం చెప్పగలం. అంతేకాదు.. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలో ఎంత అయితే పెరిగాయో.. అలానే గత రెండు వారాల నుండి తగ్గుతూ వస్తున్నాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. 

 

అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత దారుణంగా పెరిగాయి అంటే 2 నెలల వ్యవధిలో దాదాపు 6 రూపాయిలు పెరిగింది. అయితే ఇప్పుడు ఆ ధర భారీగా తగ్గుతూ వస్తుంది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు రెండు వారాల నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు సోమవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 18 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 33 పైసలు తగ్గింది.

 

హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 18 పైసలు తగ్గుదలతో రూ. 78.20 కు చేరగా, డీజల్ ధర 33 పైసలు తగ్గుదలతో 72.43 రూపాయలకు చేరింది. ఇంకా విజయవాడలో, అమరావతిలో కూడా పెట్రోల్, డీజిలు ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: