వారం రోజు పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. అదేంటో బంగారం ధరలు అసలు స్థిరంగా లేవు.. ఒక రోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం.. ఈరోజు దారుణంగా తగ్గింది. ఇప్పటికే సామాన్యుడికి బహు దూరమైనా బంగారం ధర నేడు భారీగా తగ్గింది. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు బుధువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిల తగ్గుదలతో 42,160 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయిల తగ్గుదలతో 38,680 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర అంతకు మించి తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 70 రూపాయిలు తగ్గుదలతో 49,530 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: