మన భారత్ లో పెద్దవాడైన సరే పేద వాడైనా సరే ఒక గ్రామ్ అయినా ఉంటుంది బంగారం. బంగారం అంటే పిచ్చి.. ఇంట్లోకి డబ్బు వస్తుంది అంటే ఆ ఆడవారు అంత కూడా బంగారాన్ని ఖచ్చితంగా కొనాలి అంటారు.. పట్టు పట్టి అయినా సరే బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే బంగారం అంటే భారతీయులకు పిచ్చి కాబట్టి.. 

 

అలాంటి ఈ బంగారం ధర ప్రస్తుతం భారీగా పెరిగిపోయింది.. ఒక్క ఏడాది.. కాదు కాదు ఆరు నెలల్లో 25 శాతం అంటే దాదాపు 10 వేల రూపాయిలు బంగారంపై పెరిగింది. ప్రస్తుతం ఈ బంగారం ధర పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 42 వేలు.. 10 గ్రాముల 22 క్యారెట్లు 38 వేలు ఉన్నాయి.. ఇవి మాములు ధరలు అదే బంగారం షాపుల్లోకి వెళ్తే టాక్స్ అని ఆభరణం చేసిన కూలి అని అదే 10గ్రాముల బంగారంపై మరో 10వేలు అదనపు ఖర్చు వేస్తారు. 

 

దీంతో మహిళలు బంగారం అంటే ఇష్టం ఉన్న వెనకడుగు వేస్తున్నారు.. అయితే అలాంటి ఈ బంగారం ధరపై గ‌త ఏడాది బ‌డ్జెట్ స‌మయంలో బంగారంపై ఉన్న ట్యాక్సుల‌ను అంతో ఇంతో త‌గ్గించి మ‌హిళ‌ల‌కు ఊర‌టక‌ల్పిస్తార‌ని మ‌హిళా మంత్రిగా ఉన్న నిర్మల సీతారామ‌న్ పై ఆశ‌లు భారీ ఎత్తున పెట్టుకున్నారు. ఇప్పుడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కూడా ఒక మహిళా అవ్వడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. మ‌రి ఇప్పుడైనా ఆమె క‌రుణిస్తారా? ఆడవారి బాధ అర్థమవుతుందా అనేది ఈ బడ్జెట్ విడుదల అవుతే కానీ చెప్పలేం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: