పెట్రోల్, డీజిల్ ధరలు ఒక రోజు బ్రేక్ ఇచ్చి మళ్ళి ఈరోజు భారీగా తగ్గాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్దీ రోజుల నుండి భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే స్థిరంగా కొనసాగి నేడు తగ్గటం కంటిన్యూ అయ్యాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న ఈ పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. 

 

అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్దీ రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు గురువారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 17 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 23 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 30 పైసలు తగ్గుదలతో రూ. 79.01కు చేరగా, డీజల్ ధర 24 పైసలు తగ్గుదలతో 72.36 రూపాయలకు చేరింది. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా ఎంత మాత్రం తగ్గుతాయి అనేది చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: