సాధార‌ణంగా వృత్తి బ‌ట్టి నెల‌కు వంద‌, వేలు, ల‌క్ష‌, కోట్ల‌లో సంపాద‌న ఉంటుంది. అయితే కేవ‌లం ఒక్క‌ గంట‌కు రూ. 16 వేల కోట్ల సంపాద‌న వ‌స్తే ఎలా ఉంటుంది..? అప్పుడు నిజంగా అత‌డు అదృష్ట‌వంతుడే అవుతాడు క‌దా. షేర్ మార్కెట్ ఓడలను బండ్లను చేస్తుంది, బండ్లను ఓడలను చేస్తుందన్న పాతమాట. ఇటీవల ట్రెండ్ మారింది. దిగ్గజ కంపెనీలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకుంటూ సంపదను బాగా పోగుచేసుకుంటున్నాయి. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపాదన నిన్న కేవ‌లం ఒక్క గంటలోనే దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు అంటే ఇండియ‌న్  కరెన్సీలో గంటకు 16,000 కోట్ల రూపాయలు సంపాదించారు.

 

ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం.  టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. అంచనాల కంటే నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయనే అంచనాలు.. మోడల్‌ వై క్రాసోవర్‌ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో నిన్న వాల్‌స్ట్రీట్‌లో ఈ షేర్లు పరుగులు తీశాయి. ఈ క్ర‌మంలోనే కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపాదన ఏకంగా 2.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్ బెర్గ్ అంచనాల ప్రకారం ఎలన్ మస్క్ సంపద 36 బిలియన్ డాలర్లకు పెరగడం విశేషం.

 

కాగా.. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్‌ మస్క్‌ వద్ద టెస్లాలో ఐదోవంతు షేర్లు ఉన్నాయి. ఇక స్పేస్‌ ఎక్సోప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌లో 14.6 బిలియన్‌ డాలర్ల షేర్లు ఉన్నాయి. కొన్నాళ్ల కిందటే టెస్లా మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లను దాటేసింది. దీనిని మస్క్‌ నిలబెట్టుకోగలిగితే ఆయన సంపద భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో మస్క్‌కు 346 మిలియన్‌ డాలర్లు అందనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: