బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయి తెలియటం లేదు. ఒకరోజు భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతాయి. ఇలా తగ్గుతూ పెరుగుతూ పోతున్న ఈ బంగారం ధరలలో నేడు భారీగా తగ్గాయి. మన భారతీయులకు ఎంతో ఇష్టమైన ఈ బంగారం ధర ఇప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తులో పెరిగిపోయింది. బంగారం అంటేనే వామ్మో అనేలా బంగారం ధర పెరిగిపోయింది. 

 

ఈ నేపథ్యంలోనే నేడు శుక్రవారం బంగారం ధరలు ఎంత తగ్గాయి అంటే.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల తగ్గుదలతో 41,840 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయిల తగ్గుదలతో 38,330 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం ధర ఎంత అయితే తగ్గిందో వెండి ధర కూడా అంతే తగ్గింది. 

 

కేజీ వెండి ధర ఏకంగా 200 రూపాయిల తగ్గుదలతో 49,000 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు మరింత తగ్గుతాయా? లేక ఇంకా పెరుగుతాయా అనేది చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: