దేశీయ దిగ్గజ బ్యాంకు అయినటువంటి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కు మంచి రోజులు వచ్చాయి. మునుపెన్నడూ చూడని అద్భుత ఫలితాలు పొందింది. బ్యాంకింగ్ వ్యవస్థనే నివ్వరపరిచే అద్భుత పఃలితాలను క్యూ౩ ఆర్ధిక ఫలితాలు వెల్లడించే అందరినీ విస్మయానికి గురిచేసింది. దాదాపు 15 సంవత్సరాలుగా లేని అద్భుత ఫలితాలు ఈ  త్రైమాసికంలో పొంది అందరినీ అనందంలో ముంచెత్తింది. దిగ్గజ  బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఈ త్రైమాసికం మంచి ఫలితాలను చవిచూసింది.

 

 

     అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు గల ఆర్ధిక ఫలితాలలో ఏకంగా 41 శాతం పెంచుకొని 5,583 కోట్లుగా నమోదు చేసింది. నాన్ పెర్ఫార్మింగ్ ఆస్తులు అదేనండి మొండి బకాయిలకు తక్కువ కేటాయింపులు చేస్తూ ఎస్బీఐ తన నికర ఆదాయాన్ని ఘణనీయంగా పెంచుకుంది. ఈ తక్కువ కేటాయింపుల కారణంగా ఎస్బీఐ  ఆదాయం 22 శాతం పెంచుకొని రూ.27,779 కోట్లుగా నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరపు ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.22,691 కోట్లుగా నమోదు చేసుకుంది.

 

 

    2.79 శాతంగా ఉన్నా ఎన్పీఏ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో  2.65 శాతంగా తగ్గడంశుభ పరిణామమే.  స్టేట్ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7.19 శాతం నుంచి 6.94 శాతానికి దిగొచ్చాయి.  స్థూల ఎన్‌పీఏల విలువ కూడా తగ్గి  రూ.1,59,661 కోట్లగా నమోదైంది. బ్యాంకు షేర్ విలువ కూడా 3 .5 మేర పెరిగి ముందుకు వెళుతోంది.ఈ అంశమే బ్యాంకు అధిక లాభాలను చూసేదానికి వీలు కల్పించింది. ఇదేవిధంగా ఆర్ధిక ఫలితాలను ఇక ముందు కూడా చూడాలంటే స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మరిన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు వెళ్లాల్సి వుంది. ఏది ఏమైనా దిగ్గజం మరొకసారి తాను గజమే అని ఈ పలితాలతో ప్రపంచానికి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: