రిలయన్స్ జియో.. ఇప్పుడు జియో ఫైబర్ యూజర్ ల కోసం సరికొత్త జియో టీవీ కెమెరాను విడుదల చేసింది. విడుదల చేసిన కెమెరాను ఉపయోగించుకుని యూజర్ లు... జియో ఫైబర్ సెట్ టాప్ బాక్స్ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ జియో టీవీ కెమెరాను యూజర్ల టీవీ కి అమర్చవలసి ఉంటుంది. ఇలా ఈ కెమెరాను ఒక్కసారి అమర్చుకుంటే సరిపోతుంది. అమెరికా పూర్తయితే.. యూజర్లు ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. 

 

అయితే... ఇప్పుడు ఈ సెట్ టాప్ బాక్స్‌ కు జియో టీవీ కెమెరాలు పనిచేస్తాయా.. ? లేదా.. ? అన్నది ఇంకా తెలియని విషయం.. ప్రస్తుతం విడుదల చేసిన జియో టీవీ కెమెరా ధర రూ.2,999 గా ఉంది.  ప్రస్తుతానికి ఇది కేవలం జియో వెబ్‌ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే వీటిని ఈఎంఐ ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చని జియో పేర్కొంది. 

 

అలాగే.. ఈఎంఐ ఆప్షన్ తో పాటు, సంవత్సర కలం పాటు వారెంటీ కూడా లభిస్తుంది. కొనుగోలు చేసి డెలివరీ అయ్యాక కెమెరా పనితీరు బాగాలేకున్నా.. ఇంకేదైనా సమస్య ఉన్నా డెలివరీ అయిన ఏడు రోజుల్లోపు రీప్లేస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ కెమెరా ద్వారా జియో నుంచి జియో నంబర్లకు మాత్రమే టీవీ టు టీవీ వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అన్ని మొబైల్, ల్యాండ్‌ లైన్ నంబర్లకు ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు.

 

 కెమెరా ఇన్‌ స్టాలేషన్‌ కు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. కెమెరాకు చివరన ఉన్న యూఎస్‌బీ పోర్టును సెట్‌ టాప్ బాక్స్‌ లోని యూఎస్‌బీ పోర్టకు అనుసంధానిస్తే సరిపోతుంది. అనంతరం సెట్ టాప్ బాక్స్‌ను రీబూట్ చేసి, జియో కాలింగ్ యాప్‌ లో మన ల్యాండ్‌ లైన్ నంబరును సెటప్ చేస్తే సరిపోతుంది. వీడియో కాల్స్ ను జియో యాప్ ద్వారా మాట్లాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: