భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం.. అందుకే బంగారం ధర కేవలం ఆరు నెలల్లో 25 శాతం పెరిగిపోయింది. ఇంకా అంత పెరిగిపోయిన బంగారం ధర.. ఈరోజు భారీగానే తగ్గింది. కానీ ఈరోజు తగ్గుదల రేపటికి భయాన్ని పుట్టిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు బంగారం 80 రూపాయిలు తగ్గితే రేపు 190 రూపాయిలు పెరుగుతుంది కాబట్టి.. ఈ రెండు రోజులు బంగారం ధరలు భారీగా తగ్గాయి అంటే రేపో మాపో మళ్ళి ఓ షాక్ తప్పదు అనే కదా అర్ధం. 

 

అయితే ఈరోజు బంగారం ధరలు ఎంత తగ్గాయి అంటే.. నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయిల తగ్గుదలతో 41,330 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 80 రూపాయిల తగ్గుదలతో 38,800 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం ధర తగ్గితే వెండి ధర భారీగా పెరిగింది. 

 

కేజీ వెండి ధర ఏకంగా 40 రూపాయిల పెరుగుదలతో 49,850 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా తగ్గిన మళ్ళి అంతే పెరుగుతున్నాయి అని అంటున్నారు పసిడి ప్రియులు.

మరింత సమాచారం తెలుసుకోండి: