కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. తాజా బడ్జెట్ లో కేంద్రం ఆధార్ కార్డు ఉన్నవారికి ఒక శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డ్ ద్వారా సులభంగా పాన్ కార్డును పొందేలా నిబంధనలలో మార్పులు చేసింది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించే విధంగా కేంద్రం ఆదాయపు పన్ను శాఖ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొనిరానుంది. 
 
అదే సమయంలో పాన్ కార్డును సులభంగా పొందేలా నిబంధనలలో మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖ అతి త్వరలో ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొనిరానుంది. ఈ విధానంలో పాన్ కార్డు కోసం ధరఖాస్తు కూడా చేయాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి పాన్ కార్డు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే సులభంగా పాన్ కార్డును పొందవచ్చు. 
 
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కొత్త విధానంలో ఆధార్ కార్డును ఉపయోగించి పాన్ కార్డును పొందవచ్చని చెప్పారు. ఎటువంటి ధరఖాస్తు అవసరం లేకుండా ఆధార్ కార్డ్ ద్వారా ఆన్ లైన్ లో పాన్ నంబర్ లభిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇకనుండి పాన్ కార్డ్ కావాలనుకునేవారు ఆధార్ కార్డును ఉపయోగించి వెంటనే పాన్ నంబర్ ను పొందవచ్చు. ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్నవారు పాన్ కార్డ్ చెల్లుబాటు కావాలంటే మాత్రం మార్చి 31వ తేదీలోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది. 
 
పాన్ కార్డు ఆదాయపుపన్నుశాఖ రిటర్నులు దాఖలు చేయడానికి ఉపయోగపడటంతో పాటు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించాలన్నా అవసరం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: