బంగారం ధర కొండెక్కింది.. ఇప్పట్లో ఆ కొండను నుండి బంగారాన్ని ఎవరు దించలేరు అంటే నమ్మరు.. అంత భారీగా ధరలు పెరిగిపోయాయి. సాధారణంగానే మన భారతీయులకు బంగారం అంటే పిచ్చి.. ఎంత పిచ్చి అంటే.. ఇంట్లో ఒక లక్ష రూపాయిలు ఉంది అంటే.. పద బంగారం కొందాం అనేంత పిచ్చి. అయితే అలాంటి అంత పిచ్చి ఉన్న సరే ఇప్పుడు బంగారం కొనలేని పరిస్థితి. 

 

ఎందుకంటే.. బంగారం ధర ఒక్క సంవత్సరంలోనే 25 శాతం ధర పెరిగింది. అందుకే సామాన్యులు బంగారం అంటే భయపడుతున్నారు. అయినప్పటికీ ఏదైనా పండగ అంటే చాలు బంగారం కొనేస్తారు. ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 420 రూపాయిల పెరుగుదలతో 42,330 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 420 రూపాయిల పెరుగుదలతో 38,880 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర అదే బాట పట్టింది. దీంతో నేడు కేజీ వెండి ధర 140 రూపాయిల పెరుగుదలతో 49,990 రూపాయిల వద్దకు చేరింది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. సామాన్యులకు అందనంత దూరంలో ప్రస్తుతం బంగారం ధరలు చేరాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: