పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకొద్ది కాలానికి ఫ్రీ వచ్చేలా కనిపిస్తున్నాయ్. అని అంట అనుకున్నారా? అంతలేదు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు తగ్గచ్చు కానీ ఇంకొద్ది కాలానికి బాగా పెరుగుతాయి అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.. ఎప్పుడు తగ్గని విధంగా.. కాస్త కూడా బ్రేక్ తీసుకోకుండా పెట్రోల్, డీజిల్ ధరల గత నెల రోజుల నుండి తగ్గుతూ వస్తున్నాయి. 

 

అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా భారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి అని అనుకుంటున్నారా? అదేనండి.. పెట్రోల్ పై అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు సోమవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 6 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 9 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 6 పైసలు తగ్గుదలతో రూ. 77.71కు చేరగా, డీజల్ ధర 9 పైసలు తగ్గుదలతో 72.07 రూపాయలకు చేరింది.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. ఇది వాహనదారులకు మంచి వార్త అనే చెప్పాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: