బంగారం ధర పెరుగుదలకు నేడు బ్రేక్ పడింది. కొండా ఎక్కిన బంగారం ధర ఒకేసారి కాలు జారీ కిందపడ్డట్టు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగారం ధర ఇప్పుడు దాదాపు 43వేలను తాకడానికి సిద్ధం అయ్యింది. దాదాపు అంత దూరమే వెళ్ళింది. అయినా భారతీయులకు బంగారం అంటే ప్రాణం.. అందుకే బంగారం ధర కేవలం ఆరు నెలల్లో 25 శాతం పెరిగిపోయింది. ఇంకా అంత పెరిగిపోయిన బంగారం ధర.. ఈరోజు భారీగానే తగ్గింది. 

 

ఈ నేపథ్యంలోనే బంగారంపై బడ్జెట్ ఎఫెక్ట్ కాస్త పడింది అని చెప్తున్నారు.. మార్కెట్ నిపుణులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిల తగ్గుదలతో 42,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిల తగ్గుదలతో 39,110 రూపాయలకు చేరింది. 

 

ఇంకా బంగారం ధర ఎంత అయితే తగ్గిందో దానికి రెట్టింపు వెండి ధర తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా 900 రూపాయిల తగ్గుదలతో 49,000 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ఇప్పుడు తగ్గిన మళ్ళి ఎంత పెరుగుతాయో అని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: