బంగారం ధరలు భారీగా తగ్గటం ప్రారంభించాయి. ఎంత భారీగా అంటే గతంలో ఎన్నడూ ఇంత దారుణంగా తగ్గలేదు. మొట్టమొదటిసారి ఇంత భారీగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగానే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఎలా అనుకుంటున్నారా? 

 

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టించింది. సృష్టిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అత్యంత వేగంగా ఈ వైరస్ విస్తరిస్తుంది. ఇంకా చైనాలో అయితే మరి దారుణంగా.. ఇప్పటికే 500 మందికిపైగా మృతి చెందగా దాదాపు 20వేలమంది ఈ వైరస్ భారిన పడ్డారు. 

 

అందుకే చైనాలో ప్రజలు బయటకు అడుగు కూడా పెట్టడం లేదు. ఇంకా అలాంటి చోటా బంగారం ఏం కొంటారు.. ఒక్క అక్కడే కాదు.. ఈ వైరస్ కారణంగా అంతర్జాతీయంగా బంగారం పట్ల డిమాండ్ భారీగా తగ్గింది. అందుకే ఇప్పుడు బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇంకా ఈ కరోనా వైరస్ కాస్త భారతీయులను వణికించినప్పట్టికి మన భారతీయులకు ప్రస్తుతం బంగారం తగ్గటం అనేది ఒక వరమే. 

 

ఇంకా బంగారం ధరలు ఈరోజు ఎంత తగ్గాయి అంటే.. నేడు బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిల తగ్గుదలతో 42,450 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 340 రూపాయిల తగ్గుదలతో 38,770 రూపాయలకు చేరింది. 

 

ఇంకా బంగారం ధర ఎంత అయితే తగ్గిందో దానికి రెట్టింపు వెండి ధర తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా 500 రూపాయిల తగ్గుదలతో 48,500 రూపాయిలకు చేరింది. అయితే బంగారం ధరలు తగ్గటానికి కరోనా వైరస్ మంత్రంలా భలే పని చేసింది అని ఈ తగ్గింపు చూస్తేనే అర్థం అవుతుంది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: