బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వినియోగదారులకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి గుడ్ న్యూస్ అందించింది. సాధార‌ణంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వాళ్లంద‌రూ ఎంతోకంత సొమ్ము దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, రోజు వారీ కూలికి వెళ్ళే వారు ఇలా చాలా మంది ఫ్యూచ‌ర్ ప్లానింగ్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి డ‌బ్బును దాచుకుంటున్నారు. మన దేశంలో ఈ విధానం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇక నుంచీ బ్యాంకుల్లో దాచుకున్న  సొమ్ముకు మరింత ఎక్కువ రక్షణ లభించనుంది.

 

ఇప్పుడు ఉన్న ఆర్థిక  సంవత్సరంలో డిపాజిట్ బీమా పై పరిమితిని పెంచనున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇది ఊహించిన దానికంటే ఎక్కువ పెంచింది.  బ్యాంకు డిపాజిట్లపై ఇప్పటి వరకు ఉన్న బీమా కవరేజీని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారంనాటి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించడం తెలిసిందే.  దీనికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో   ఫిబ్రవరి 4 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

 

డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తం 1993 నుంచే స్థిరంగా ఉంటూనే వస్తోంది. ఇందులో ఎలాంటి పెంపు లేదు. రూ.లక్షగా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు మోదీ సర్కార్ మాత్రం పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 27 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిన విధానాన్ని సవరించింది.  పెంచిన బీమా కవరేజీ దేశంలోని ప్రైవేటు బ్యాంకులతో పాటు కోఆపరేటివ్ బ్యాంకులు, దేశంలోని విదేశీ బ్యాంకుల శాఖల్లో డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది. ఇక దీని ద్వారా ఏదైనా కారణం చేత బ్యాంకు మూతపడితే అందులో డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: