ఈ మధ్యకాలంలో హోమ్ లోన్స్ భారీగా తగ్గాయి అంటే భారీగా తగ్గాయి. ఎప్పుడు చూడు ఏదో ఒక కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉన్నాయి బ్యాంకులు.. మొన్నటివరకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ భారీగా తగ్గించింది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిత్యం ఏదో ఒక ఆఫర్ ఇస్తుంది. కస్టమర్లను ఆకర్షించడానికి పడరాని పట్లు పడుతుంది. 

 

ఇంకా గత కొద్దీ రోజుల నుండి అయితే వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. ఇప్పటికే ఎనిమిది సార్లు వడ్డీ రేటును తగ్గించిన తాజాగా మళ్లీ తొమ్మిదోసారి వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.90గా ఉండగా తాజాగా తొమ్మిదోసారి తగ్గింపుతో ఇది 7.85కు చేరింది. 

 

అయితే ఈ తగ్గిన వడ్డీ రేటు ఈ నెల 10వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. అయితే ఈ కొత్త నిర్ణయంతో హోమ్ లోన్స్, వెహికిల్ లోన్లు మరింత చౌకగా లభించనున్నాయి. మరోవైపు టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లను కూడా భారీగా తగ్గించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇప్పుడు ఏవి అయితే తగ్గించారో అవి అన్ని ధరలు కూడా ఫిబ్రవరి 10 తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఏది ఏమైనా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికీ మంచి శుభవార్తే అందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: