ఈ మధ్యకాలంలో దాదాపు నెల రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.. ఆ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం చూస్తే వావ్ అని ఆశ్చర్యం వెయ్యాల్సిందే. ఏంటి పెట్రోల్, డీజిల్ ఇంత తగ్గాయా అని.. ఎందుకంటే.. వరుసగా రెండు నెలలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి భారీగా తగ్గుతు వస్తున్నాయి.

 

రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.   

 

నేడు శనివారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 30 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 28 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 30 పైసలు తగ్గుదలతో రూ. 77.03కు చేరగా, డీజల్ ధర 28 పైసలు తగ్గుదలతో 71.41 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా భారీగా తగ్గుతూ రావడం వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: