నేటి ప్రపంచం టెక్నాలజీని దినదినా అభివృద్ధి చేస్తున్నారు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరగాళ్లు కూడా అంతే అభివృద్ధి చెందుతున్నారు. మన ఎటిఎం కార్డు మన దగ్గరే ఉన్న మనీ కాచేస్తున్నారు. మీ ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు వివరాలు రహస్యంగా ఉన్నాయనుకుంటే పొరపాటే. మీ కార్డు నెంబర్లు, సీవీవీ కోడ్స్, మీ పేరు, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ చీకటి మార్కెట్‌లో అమ్మకానికి ఉన్నాయని సింగపూర్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్ ఐబీ బయటపెట్టింది.

 

భారతదేశంలోని ఐదు లక్షల మంది డేటా ఇలా డార్క్ వెబ్‌లో అమ్ముతున్నారని తేల్చింది. ఈ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే సులువుగా లావాదేవీలు జరిపేయొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో కార్డుల వివరాలు లీక్ కావడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. ఇంత పెద్ద మొత్తంలో డేటా ఎలా లీకైందన్న విషయం తేలాల్సి ఉంది.

 

సింగపూర్‌ సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్ ఐబీ సమాచారం ప్రకారం 461,976 కార్డుల వివరాలు లీకయ్యాయి. వాటిని రూ.30 కోట్లకు అమ్మకానికి పెట్టారని తేలింది. వెంటనే భారత దేశానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు గ్రూప్ ఐబీ సమాచారం ఇచ్చింది. దీనిపై ఆరా తీసిన సైబర్ సెక్యూరిటీ అధికారులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల డేటా లీకేజీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆ కార్డుల్లో ఎన్ని యాక్టీవ్‌లో ఉన్నాయో తెలియదు.

 

సింగపూర్‌ సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్ ఐబీ. గత ఏడాది 13 లక్షల కార్డుల డేటా డార్క్ వెబ్‌లోకి వెళ్లింది. అయితే అందులో కేవలం మ్యాగ్నెటిక్ స్ట్రిప్‌లో ఉన్న డేటా మాత్రమే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లింది. లావాదేవీలు జరపాలంటే సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్ లాంటి వివరాలు తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా 2018-19 వార్షిక నివేదిక ప్రకారం 1,866 ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డు మోసాలు జరిగాయి. ప్రతీ మోసంలో సుమారు రూ.20 లక్షల వరకు కస్టమర్లు నష్టపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: