సోషల్ మీడియా అనగా ఫేసుబుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ఇంకా తదితర వెబ్సైటులన్నమాట. అయితే, కొత్తగా ప్రారంభించిన వార్త వెబ్సైట్లు తమ కథనాలకు ఎక్కువగా వ్యూస్ వచ్చేందుకు ఈ సోషల్ మీడియా చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని జర్మన్ చెందిన ఫ్రాంక్ మాన్ గోల్డ్ వెల్లడించారు. అయితే గతంలో సోషల్ మీడియా ద్వారా న్యూస్ వెబ్ సైట్లకు ఎక్కువగా వ్యూస్ రావని చెప్పిన ఒక మూల సిద్ధాంతం అవాస్తవమని తాజాగా చేసిన ఒక పరిశోధనలో తెలిసింది.

 

 

ఫేసుబుక్, గూగుల్ లని వీక్షించే ప్రజలు ఎక్కువగా వార్తలను చదువుతారని ఈ తాజా పరిశోధనల్లో తేలింది. గూగుల్, ఫేసుబుక్ లను తరచుగా వీక్షించే వినియోగదారులకు... ఆయా సామాజిక మాధ్యమాలు వార్తలను ప్రత్యేకంగా అందిస్తాయని ఈ పరిశోధనలో తెలిసింది. అల్గారిథం ప్రకారం ఎక్కువగా పాపులర్ అయిన వెబ్సైట్లను అలాగే మంచి కంటెంట్ ఉన్న వెబ్సైట్లను ఫేసుబుక్, గూగుల్ ప్రతి ఒక్క వినియోగదారుడి వద్దకు చేరే విధంగా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 

 

 

ఈ పరిశోధనకు సంబంధించిన డేటా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి. ఈ సందర్భంగా ఫ్రాంక్ మ్యాన్ గోల్డ్ మాట్లాడుతూ... ఫేస్‌బుక్ లేదా గూగుల్‌ను సందర్శించే ఎవరైనా వార్తాలను పెట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ మధ్యవర్తుల ఉపయోగం ఇంటర్నెట్‌లో వార్తల వినియోగంలో ఒక ముఖ్యమైన విధానం', అని చెప్పారు. 

 

 

అదే ఒకవేళ సోషల్ మీడియా లేకపోతే... సాధారణంగా టీవీలో లేదా కేవలం వార్తాపత్రికల్లో మాత్రమే న్యూస్ ని చదివే అవకాశం ఉంటుంది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి ఈ వార్తలు ఏదో ఒక సందర్భంలో తారసపడతాయి. ఇలా వార్తలు ఎక్కువమందికి చేరడానికి సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అంతెందుకు వైరల్ అయ్యే ప్రతి వార్త ఆర్టికల్ కేవలం సోషల్ మీడియా వల్లనే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. సో, వీరి పరిశోధన నమ్మదగినదిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: