పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎలా తగ్గుతున్నాయి తెలుసా? గతంలో ఎన్నడూ ఇంతలా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి ఉండవు.. అలాంటిది ఇప్పుడు ఏకంగా రెండు నెలల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఆ తగ్గుదల చూస్తే ఎవరైనా సరే.. ఆశ్చర్య పోవాల్సిందే.. ఆలా ఉన్నాయి ధరలు. 

 

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. కరోనా వైరస్ దెబ్బ వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి అని సమాచారం. అయితే ఈ పెట్రోల్ డీజిల్ ధరల తగ్గుదల చాలా ఘోరంగా ఉంది. అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. మూడు నెలల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ఒక్క నెల రోజుల్లో భారీగా తగ్గాయి. 

 

దీంతో నేడు సోమవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 23 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 14 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 23 పైసలు తగ్గుదలతో రూ. 76.85కు చేరగా, డీజల్ ధర 14 పైసలు తగ్గుదలతో 71.14 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా కరోనా వైరస్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా భారీగా తగ్గటం కారణంగా వాహనదారులకు కాస్త ఊరట కలిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: