బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఒకేసారి రెండు వార్తలు అందించింది. ఇందులో ఒకటి తీపికబురు. రెండోదేమో బ్యాడ్ న్యూస్. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో కొంత మందికి ప్రయోజనం కలిగితే మరికొందరిపై బాదుడు ప్రభావం పడనుంది. అవును.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నేరుగానే బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడబోతోంది. ఇది కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. 

 

స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపును పరిశీలిస్తే.. రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 10-50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అదే బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై తగ్గింపు 25-50 బేసిస్ పాయింట్ల మధ్యలో ఉంది. స్టేట్ బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు యథాతథంగానే కొనసాగుతాయి. ఇక మిగతా కాల పరిమితిలోని రేట్లు మారాతాయి. 

 

బ్యాంక్‌ లేటెస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు గమనిస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం, 46 నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ వస్తుంది. 180 నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై 5.5 శాతం, 211 నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై కూడా 5.5 శాతం వడ్డీనే లభిస్తుంది. అదేసమయంలో ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీ వస్తుంది. అంతేకాకుండా 2 నుంచి 3 ఏళ్లు, 3 నుంచి 5 ఏళ్ల, ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. 

 

ఇకపోతే స్టేట్ బ్యాంక్ సాధారణ బ్యాంక్ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్స్‌కు ఎక్కువ వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌ 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అంటే వీరికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించినప్పటికీ బ్యాంక్ ఇప్పుడు రుణ రేట్లలో కోత విధించింది. దీంతో రుణం తీసుకునే వారికి ప్రయోజనం కలుగనుంది. లెండింగ్ రేట్లు తగ్గింపుతో హోమ్ లోన్ సహా ఇతర వాహన రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త రేట్లను ఒకసారి గమనిస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి దిగొచ్చింది అంచనా..

మరింత సమాచారం తెలుసుకోండి: