భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒకరోజు తగ్గితే మరో రోజు పరుగుతాయి ఈ బంగారం ధరలు.. అలాంటి ఈ బంగారం ధరలు ప్రస్తుతం భారీగా తగ్గాయి.. బంగారం డిమాండ్ అంతర్జాతీయంగా భారీగా పడిపోయింది. కారణం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 

 

అయితే ఈ నేపథ్యంలోనే చైనాలో ప్రజలు బయటకు రావడానికి.. నిత్యావసర వస్తువులు కొనడానికే భయపడుతున్నారు. అలాంటిది ఇంకా బంగారం ఏం కొంటారు. అందుకే బంగారం కొనుగోలు దారులు అటు వైపు దేశాలు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో బంగారం డిమాండ్ భారీగా తగ్గిపోయింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. 

 

ఈ నేపథ్యంలోనే నేడు మంగళవారం బంగారం ధరలు ఎంత తగ్గాయి అంటే.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై దాదాపు 20 రూపాయిల తగ్గుదలతో 42,530 రూపాయలకు చేరింది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై కూడా దాదాపు 10 రూపాయిల తగ్గుదలతో 39,980 రూపాయలకు చేరింది. బంగారం ధరలు పడిపోగా వెండి ధర భారీగా పెరిగింది. 

 

దీంతో కేజీ వెండి ధర ఏకంగా 300 రూపాయిల పెరుగుదలతో 49,300 రూపాయలకు చేరింది. అయితే నిన్నటికి నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఉన్నట్టుండి తగ్గటంతో బంగారం కొనుగోలు దారుల నుండి భారీగా డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: