పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల నుండి భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆలా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గటానికి కారణం కరోనా వైరసే కారణం అంటున్నారు కొందరు నిపుణులు.. ఆ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం చూస్తే షాక్ అవుతారు. ఏంటి పెట్రోల్, డీజిల్ ఇంత తగ్గాయా అని.. ?

 

ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని వాహనదారులకు ఉరటనిస్తున్నాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. ప్రస్తుతం చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలు ఉండే. 

 

అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్దీ రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.  నేడు మంగళవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 23 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 26 పైసలు తగ్గింది. 

 

హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 23 పైసలు తగ్గుదలతో రూ. 76.62కు చేరగా, డీజల్ ధర 26 పైసలు తగ్గుదలతో 70.88 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా భారీగా తగ్గుతూ రావడం వాహనదారులకుమంచి వార్త అనే చెప్పాలి.. మరి నిజంగానే కరోనా కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయా?

మరింత సమాచారం తెలుసుకోండి: