పాపం విమానాలు.. పర్యాటకులు లేక.. తెగ ఇబ్బంది పడిపోతుంది. అందుకే బిజినెస్ పెంచుకోడానికి సరికొత్త ఆలోచనలతో సరికొత్త బంపర్ ఆఫర్స్ ఇస్తుంది. ఆ ఆఫర్స్ మధ్యతరగతి ప్రజలకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. అంత గొప్ప ఆఫర్స్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి బాబు.. ఇంకా రెండు రోజుల్లో వాలంటైన్స్ డే ఉంది కాదు.. 

 

అందుకే ప్రేమికుల రోజు సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది ఇండిగో.. అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ అందిస్తోంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రేమికుల రోజు సందర్భంగా.. ప్రేమ జంటలను ఆకర్షించేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ అదిరిపోయెస్ స్పెషల్ బంపర్ ఆఫర్ ను తెర మీదకు తీసుకువచ్చింది. 

 

వాలంటైన్స్ సేల్ పేరుతో.. ఇండిగో ఎయిర్ లైన్స్ ఫిబ్రవరి 11 నుండి 14 వరకు నాలుగు రోజుల పాటు.. రూ.999 ధరకే విమాన టికెట్లను విక్రయిస్తోంది. అన్ని టాక్స్‌లను కలిపి కేవలం రూ.999/- విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టికెట్ల సేల్ ఫిబ్రవరి 14తో ముగుస్తుంది. అయితే ఈ వాలెంటైన్స్ స్పెషల్ ఆఫర్ కింద టికెట్స్ బుక్ చేసుకున్న వారు మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య దేశంలో ఏదో ఒక నగరం నుండి మరో నగరానికి ఒక సారి ప్రయాణించవచ్చు.. ఏమైతేనేం ఇండిగో ఎయిర్ లైన్స్ మంచి స్పెషల్ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: