వారం రోజు పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. అదేంటో బంగారం ధరలు అసలు స్థిరంగా లేవు.. ఒక రోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం.. ఈరోజు దారుణంగా తగ్గింది. ఇప్పటికే సామాన్యుడికి బహు దూరమైనా బంగారం ధర నేడు భారీగా తగ్గింది. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిల తగ్గుదలతో 42,150 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయిల తగ్గుదలతో 38,640 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర అంతకు మించి తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిలు తగ్గుదలతో 48,800 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. ఏది ఏమైనా ఈ పసిడి ప్రియులకు శుభవార్తే. 

మరింత సమాచారం తెలుసుకోండి: