సొంత ఇంటి కల అందరికి ఉంటుంది. కానీ కొందరికి అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే.. వారి ఆర్ధిక పరిస్థితి బట్టి. అయితే ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచించేవారికి ఇది మంచి సమయం.. అయితే అదిరిపోయే బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదనపు ట్యాక్స్ బెనిఫిట్స్‌ ప్రయోజనాన్ని మరో ఏడాదిపాటు పొడిగించిన సంగతి తెలిసిందే.. హోమ్ లోన్ తీసుకున్నవారికి ఇది వర్తిస్తుంది. ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉండొచ్చని సంకేతాలిచ్చింది. 

 

సొంత ఇంటిపై అదనపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎలాగంటే? హోమ్ లోన్స్ పై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ప్రిన్సిపల్ అమౌంట్‌పై తగ్గింపు పొందొచ్చు. ఇంకా సెక్షణ్ 24బీ కింద రూ.2 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది. 

 

ఇంకా తాజా బడ్జెట్‌ 2020లో దీన్ని 2021 మార్చి 31 వరకు పొడిగించారు. దీంతో సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల వరకు వడ్డీ మినహాయింపు ఉంటుంది. 

 

ఇంటి కొనుగోలుదారులు మొత్తంగా చూస్తే రూ.5 లక్షల వరకు బెనిఫిట్స్‌ను ఉంటాయి. ఒకవేళ అధిక పన్ను చెల్లించిన 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్న వ్యక్తికి రూ.1.53 లక్షలు ఆదా అవుతుంది. 

 

అయితే హోమ్ లోన్‌పై రూ.5 లక్షల వరకు ప్రయోజనం పొందాలంటే కొన్ని రూల్స్ పాటించాలి.. అవి ఎంటంటే?

 

తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేస్తూ ఉండాలి. 

 

ఇంటి విలువ రూ.45 లక్షలు మించి ఉండకూడదు. 

 

హోమ్ లోన్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో లేదా 2020-2021 ఆర్థిక సంవత్సరంలో తీసుకొని ఉండాలి. 

 

కార్పెట్ ఏరియా మెట్రో నగరాల్లో 645 చదరపు అడుగులు, ఇతర ప్రాంతాల్లో 968 చదరపు అడుగులు మించకూడదు.

 

తక్కువ రుణమైతే తక్కువ వడ్డీ.

 

రుణ మొత్తం పెరిగే కొద్ది హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు కూడా పెరుగుతూ వస్తుంది. 

 

ఈసారి బడ్జెట్‌లో ఈ వ్యత్యాసాన్ని 10 శాతానికి పెంచారు. దీంతో ఇంటి కొనుగోలుదారులపై పన్ను భారం తగ్గనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: