ఈ మధ్య కాలంలో యువత ఇంట్లో కూర్చుని ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కోసం అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాల్లో కొందరు సక్సెస్ అయితే మరికొందరు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. కానీ తెలివితేటలు, సరైన ప్రణాళిక ఉంటే మాత్రం ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ మధ్య కాలంలో గతంతో పోలిస్తే బ్యాంకింగ్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. 
 
ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ లావాదేవీలు ఎక్కువగా ఏటీఎంల ద్వారా జరుగుతున్నాయి. దాదాపు 9 రకాల సేవలు ఏటీఎంల ద్వారా కస్టమర్లకు అందుతున్నాయి. తాజాగా ఆర్బీఐ ఏటీఎంలను నెలకొల్పడం ద్వారా ఇంట్లో నుండే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆర్బీఐ దేశవ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానం కొరకు 12 బ్యాంకులు, కంపెనీలకు లైసెన్స్ లు కేటాయించింది. ఈ 12 బ్యాంకులు, కంపెనీలతో టై అప్ కావడం వలన నిరుద్యోగులు ఇంట్లో కూర్చుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చు. 
 
వైట్ లేబుల్ ఏటీఎం ఏర్పాటు చేసి డబ్బు సంపాదించాలనుకుంటే రద్దీగా ఉండే ప్రదేశంలో 25 చదరపు అడుగుల నుండి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. బ్యాంక్ లేదా కంపెనీలు ఇచ్చే వైట్ లేబుల్ ఏటీఎంను ఆ స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. ఏటీఎం భద్రతా చర్యలు, విద్యుత్ ఛార్జీలు, నిర్వహణా ఛార్జీలు ఏటీఎంలను ఏర్పాటు చేసినవారే భరించాల్సి ఉంటుంది. ఏర్పాటు చేసిన ఏటీఎంలలో ఎన్ని లావాదేవీలు జరిగితే ఒక్కో లావాదేవీకి కొంత అమౌంట్ ఏటీఎం ఏర్పాటు చేసిన వారి బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ఈ విధంగా సులభంగా ఇంట్లో కూర్చుని డబ్బులను సంపాదించవచ్చు. వైట్ లేబుల్ ఏటీఎంల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులు ఇంట్లో కూర్చునే వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆర్బీఐ వెబ్ సైట్ లో వైట్ లేబుల్ ఏటీఎం ఏర్పాటుకు సంబంధించిన మరింత సమాచారం లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: