బంగారం,, భారతీయులకు ఎంతో ఇష్టమైనది.. అలాంటి ఇష్టమైన బంగారం ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.. రోజుకో రూపంలో బంగారం ధరలు ఉంటున్నాయి. నిన్నటికి నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు అంత బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 

 

అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి.. నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిల తగ్గుదలతో 42,640 రూపాయిలు చేరగా.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిల తగ్గుదలతో 39,130 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 53 రూపాయిల తగ్గుదలతో 49 వేల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

ఇంకా విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో 38,840 రూపాయలకు చేరింది. వెండి ధర రూ.49వేల వద్ద స్థిరంగా కొనసాగింది. విశాఖపట్నం మార్కెట్లోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి.

 

ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40 రూపాయిల తగ్గుదలతో 40,860 రూపాయిల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయిల తగ్గుదలత రూ.39,700కు చేరింది. ఇక కేజీ వెండి ధర అక్కడ కూడా 49,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే బంగారంపై భారీ డిమాండ్ తగ్గటం వల్లే ఇలా బంగారం ధరలు తగ్గాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: