నిజంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో చూస్తే షాక్ అయిపోతారు. రోజు రోజుకు భారీగా తగ్గుతూ.. వాహనదారులకు మంచి రోజులు వచ్చాయి అనేలా చేస్తున్నాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. మరో రోజు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.. ఇలా తగ్గుతూ పెరుగుతున్న వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు గతనెల వరుకు కొండపైన ఉన్నాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు మంగళవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో 76.40 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 06 పైసలు తగ్గుదలతో 70.42 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.84 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.82కు చేరింది. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై ఐదు రూపాయిలు తగ్గింది. ఏది ఏమైనా ఇది వాహనదారులకు అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: